HomeArticlesAyushman Bharat Digital Mission: ఆయుష్మాన్ భారత్: రూ. 5 లక్షల లిమిట్ అయిపోతే పరిస్థితి ఏంటి? కార్డు రీఛార్జ్ ఎప్పుడవుతుంది?

Ayushman Bharat Digital Mission: ఆయుష్మాన్ భారత్: రూ. 5 లక్షల లిమిట్ అయిపోతే పరిస్థితి ఏంటి? కార్డు రీఛార్జ్ ఎప్పుడవుతుంది?

Ayushman Bharat Digital Mission: ఆయుష్మాన్ భారత్: రూ. 5 లక్షల లిమిట్ అయిపోతే పరిస్థితి ఏంటి? కార్డు రీఛార్జ్ ఎప్పుడవుతుంది?

Ayushman Bharat Digital Mission: అనారోగ్యం చెప్పకుండా వస్తుంది. అది వెంట తెచ్చే శారీరక బాధ కంటే, ఆసుపత్రి ఖర్చుల వల్ల కలిగే ఆర్థిక బాధే మధ్యతరగతి, పేద కుటుంబాలను ఎక్కువగా భయపెడుతుంది. ఈ భయాన్ని పోగొట్టడానికే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన' (PMJAY)ను అమలు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాల్లో ఒకటైన దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.


అయితే, ఈ కార్డు వినియోగం, లిమిట్ రీఛార్జ్ వంటి విషయాలపై ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎన్నిసార్లయినా వెళ్లొచ్చు.. కానీ: ఈ పథకం కింద ఆసుపత్రికి వెళ్లే సంఖ్యపై (Frequency) ఎలాంటి పరిమితి లేదు. కార్డు ఉన్న లబ్ధిదారులు ఏడాదిలో ఎన్నిసార్లయినా చికిత్స పొందవచ్చు. చిన్న అనారోగ్యమైనా, పెద్ద ఆపరేషన్ అయినా.. మొత్తం రూ. 5 లక్షల పరిమితి లోబడి ఉచితంగా చికిత్స లభిస్తుంది. ఇది పూర్తిగా నగదు రహితం (Cashless). అడ్మిషన్ నుంచి మందులు, డిశ్చార్జ్ వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.


లిమిట్ అయిపోతే ఎలా?

ప్రభుత్వం కేటాయించిన రూ. 5 లక్షల లిమిట్ ఒక ఆర్థిక సంవత్సరానికి (Financial Year) వర్తిస్తుంది. ఒకవేళ తీవ్ర అనారోగ్యం కారణంగా ఒకేసారి లేదా పలు దఫాలుగా ఆ మొత్తం లిమిట్ పూర్తయిపోతే, ఆ ఆర్థిక సంవత్సరం మిగిలిన రోజుల్లో ఈ కార్డు ద్వారా ఉచిత వైద్యం పొందలేరు. అప్పుడు సొంత ఖర్చులతోనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.


ఆటోమేటిక్ రీఛార్జ్:

అయితే, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రతీ సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే 'ఏప్రిల్ 1వ తేదీన' మీ ఆయుష్మాన్ కార్డు వాలెట్ ఆటోమేటిక్‌గా రీఛార్జ్ అవుతుంది. ప్రభుత్వం మళ్లీ కొత్తగా రూ. 5 లక్షల నిధిని కార్డుకు జమ చేస్తుంది. కార్డు ఎలా పొందాలి? అర్హత ఉన్నవారు ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం లేనివారు సమీపంలోని సీఎస్సీ (CSC) సెంటర్ లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోని 'ఆరోగ్య మిత్ర'ను సంప్రదించి కార్డు పొందవచ్చు.

Tags

#ఆయుష్మాన్ భారత్#పిఎంజెఎవై#ఆరోగ్య బీమా#కేంద్ర ప్రభుత్వం#Ayushman Bharat#PMJAY#Health Insurance#Free Treatment

Related Articles