HomeArticlesదిల్లీ ఎర్రకోట పేలుడు: 9కి చేరిన మృతుల సంఖ్య.. అన్ని కోణాల్లో దర్యాప్తు: అమిత్ షా

దిల్లీ ఎర్రకోట పేలుడు: 9కి చేరిన మృతుల సంఖ్య.. అన్ని కోణాల్లో దర్యాప్తు: అమిత్ షా

దిల్లీ ఎర్రకోట పేలుడు: 9కి చేరిన మృతుల సంఖ్య.. అన్ని కోణాల్లో దర్యాప్తు: అమిత్ షా

దిల్లీ ఎర్రకోట పేలుడు: దర్యాప్తు ముమ్మరం

దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీపేలుడు (Delhi Bomb Blast) ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు చోటు చేసుకున్న కారు పూర్వ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాకు చెందిన నదీమ్‌ఖాన్‌ పేరుతో ఈ కారు రిజిస్టర్‌ అయినట్లు గుర్తించారు.

హుండాయ్‌ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లుగా గుర్తించామని ఓ సినీయర్‌ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఘటన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు. అయితే గాయపడిన వారి శరీరంలో ఎలాంటి పెల్లెట్‌ గుర్తించలేదని పేర్కొన్నారు. బాంబు పేలుడులో ఇది అసాధారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

హుండాయ్‌ ఐ20 కారును తొలుత మహ్మద్‌ సల్మాన్‌ కొన్నారు. అనంతరం అది నదీమ్‌ఖాన్‌ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు వర్గాలు పేర్కొన్నాయి. గురుగ్రామ్‌ పోలీసులు సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో పేలుడు జరిగినట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


దిల్లీ పేలుడు ఘటన.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: అమిత్‌ షా

ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. సాయంత్రం 6.52 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చిన కారు రెడ్‌లైట్‌ వద్ద ఆగిందని, ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు దిల్లీ నగర పోలీస్‌ కమిషనర్‌ వివరించారు. ఈ ఘటనలో సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. 22 వాహనాలు ధ్వంసమయ్యాయి.

Related Articles