HomeArticlesAI Bubble: 'ఏ కంపెనీకి మినహాయింపు లేదు'.. ఏఐ బబుల్ పేలితే ముప్పేనన్న సుందర్ పిచాయ్!

AI Bubble: 'ఏ కంపెనీకి మినహాయింపు లేదు'.. ఏఐ బబుల్ పేలితే ముప్పేనన్న సుందర్ పిచాయ్!

AI Bubble: 'ఏ కంపెనీకి మినహాయింపు లేదు'.. ఏఐ బబుల్ పేలితే ముప్పేనన్న సుందర్ పిచాయ్!

AI Bubble: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జపం చేస్తోంది. టెక్ కంపెనీల షేర్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇది కేవలం ఒక 'బబుల్' (నీటి బుడగ) మాత్రమేనని, అది ఎప్పుడైనా పేలిపోవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


త్వరలో గూగుల్ అత్యంత శక్తివంతమైన 'జెమిని 3'ని విడుదల చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. "ఒకవేళ ఈ ఏఐ బబుల్ పేలితే, ఆ ప్రభావం నుంచి గూగుల్ సహా ఏ ఒక్క కంపెనీ కూడా తప్పించుకోలేదు, ఎవరూ అతీతులు కాదు" అని స్పష్టం చేశారు.


పిచాయ్ మాత్రమే కాదు, సిలికాన్ వ్యాలీలోని ఇతర దిగ్గజాలు కూడా దీనిపై స్పందించారు. ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు అత్యుత్సాహం (Overexcited) చూపిస్తున్నారని అంగీకరించారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా స్పందిస్తూ.. కొన్ని వందల బిలియన్ డాలర్లు వృథా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిస్క్ తీసుకోక తప్పదని అన్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ దీనిని 90ల నాటి 'డాట్ కామ్' బూమ్‌తో పోల్చారు.


మరోవైపు, ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హాంగ్ మాత్రం ఏఐ బబుల్ వార్తలను కొట్టిపారేశారు. తాము చూస్తున్నది వేరని, ఏఐ అనేది భవిష్యత్తు ఆదాయ వనరు అని ఆయన తేల్చి చెప్పారు. ఏది ఏమైనా, ఐఎంఎఫ్ (IMF) వంటి సంస్థలు కూడా ఏఐ స్టాక్స్ పతనంపై హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో, పిచాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags

#Sundar Pichai#AI Bubble#Google#Sam Altman#Mark Zuckerberg#Jensen Huang#Artificial Intelligence#సుందర్ పిచాయ్#కృత్రిమ మేధ#ఏఐ బబుల్#టెక్నాలజీ న్యూస్

Related Articles