HomeArticles"కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయకండి.. 20ల్లోనే ఆ పని కానిచ్చేయండి!" - యువతకు జోహో సీఈఓ శ్రీధర్ వేంబు సూచన

"కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయకండి.. 20ల్లోనే ఆ పని కానిచ్చేయండి!" - యువతకు జోహో సీఈఓ శ్రీధర్ వేంబు సూచన

"కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయకండి.. 20ల్లోనే ఆ పని కానిచ్చేయండి!" - యువతకు జోహో సీఈఓ శ్రీధర్ వేంబు సూచన

వ్యాపార ప్రపంచంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన జోహో (Zoho) సీఈఓ శ్రీధర్ వేంబు, యువతకు కేవలం వ్యాపార పాఠలే కాకుండా జీవిత పాఠాలు కూడా చెబుతున్నారు. తాజాగా ఆయన యువ ఎంట్రప్రెన్యూర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.


సాధారణంగా స్టార్టప్ కల్చర్‌లో ఉన్నవారు కెరీర్‌ను నిర్మించుకునే పనిలో పడి పెళ్లి, కుటుంబం వంటి విషయాలను 30 లేదా 40 ఏళ్లకు వాయిదా వేస్తుంటారు. దీనిపై శ్రీధర్ వేంబు స్పందిస్తూ.. "నేను కలిసే యువ పారిశ్రామికవేత్తలకు (స్త్రీలు మరియు పురుషులు ఇద్దరికీ) నేను ఇచ్చే సలహా ఒక్కటే. మీ 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి. దయచేసి ఈ ముఖ్యమైన ఘట్టాన్ని వాయిదా వేయకండి" అని పేర్కొన్నారు. వ్యాపారంలో విజయం ఎంత ముఖ్యమో, వ్యక్తిగత జీవితంలో కుటుంబం కూడా అంతే ముఖ్యమని, వృత్తిపరమైన ఎదుగుదల కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా సూచించారు.


కుటుంబం అనేది ఒత్తిడిని పెంచేదిగా కాకుండా, కెరీర్‌కు అండగా నిలిచే వ్యవస్థగా ఉండాలన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ (Work-Life Balance) గురించి తరచుగా మాట్లాడే వేంబు, ఇప్పుడు ఏకంగా త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించడం విశేషం.

Tags

#Sridhar Vembu#Zoho CEO#Marriage Advice#Young Entrepreneurs#Work Life Balance#శ్రీధర్ వేంబు#జోహో#యువతకు సలహా