HomeArticles'రాబిన్ హుడ్ రవి' అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్.. పైరసీని ఆపాలంటే వారిని కూడా జైల్లో వేయాల్సిందే!

'రాబిన్ హుడ్ రవి' అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్.. పైరసీని ఆపాలంటే వారిని కూడా జైల్లో వేయాల్సిందే!

'రాబిన్ హుడ్ రవి' అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్.. పైరసీని ఆపాలంటే వారిని కూడా జైల్లో వేయాల్సిందే!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆయన సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న 'పైరసీ' సమస్యపై ట్విట్టర్ (X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రాబిన్ హుడ్ రవి" (Robin Hood Ravi) అంటూ మొదలుపెట్టి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "పైరసీ అనేది ఎప్పటికీ ఆగదు. దీనికి కారణం టెక్నాలజీ ఎంత మాత్రం కాదు.. పైరసీ కంటెంట్ చూసేందుకు సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అసలు కారణం" అని వర్మ అభిప్రాయపడ్డారు.


ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేనంత ఎక్కువగా ఉన్నాయని, అందుకే పైరసీలో సినిమా చూడటం సరైనదేనని ప్రేక్షకుడు భావిస్తున్నాడని ఆయన విశ్లేషించారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కేవలం 'భయం' మాత్రమేనని ఆర్జీవీ స్పష్టం చేశారు. "పైరసీని ఆపాలంటే అక్రమంగా లింకులు క్రియేట్ చేసే వారితో పాటు, ఆ లింకులు ఓపెన్ చేసి చూస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షించాలి. చూసేవాడు కూడా నేరస్తుడే అని భయపడినప్పుడు మాత్రమే పైరసీ ఆగుతుంది" అని వర్మ చెప్పుకొచ్చారు. టికెట్ రేట్ల పెంపు, ప్రేక్షడి మనస్తత్వంపై వర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Tags

#Ram Gopal Varma#RGV Tweets#Piracy Issue#Robin Hood Ravi#Tollywood News#రామ్ గోపాల్ వర్మ#పైరసీ

Related Articles