HomeArticlesపట్టపగలే దారుణం.. తండ్రి పక్కనుంచే చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం! మథురలో షాకింగ్ వీడియో..

పట్టపగలే దారుణం.. తండ్రి పక్కనుంచే చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం! మథురలో షాకింగ్ వీడియో..

పట్టపగలే దారుణం.. తండ్రి పక్కనుంచే చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం! మథురలో షాకింగ్ వీడియో..

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో వెలుగు చూసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తోంది. పట్టపగలే, జనం తిరుగుతున్న ప్రాంతంలో ఒక తండ్రి తన కుమార్తెతో వెళ్తుండగా.. దుండగులు ఆ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. తండ్రి పక్కనే ఉన్నప్పటికీ, దుండగులు ఇంతటి సాహసానికి ఒడిగట్టడం చూస్తుంటే బయట పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ వీడియో నేపథ్యంలో నిపుణులు, నెటిజన్లు తల్లిదండ్రులకు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఒంటరిగా వదలకండి. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో వారి చేయి వదలొద్దు. పిల్లలకు చిన్నప్పటి నుంచే 'స్ట్రేంజర్ డేంజర్' (అపరిచితులతో ముప్పు) గురించి నేర్పించాలి.


పిల్లలకు తప్పక నేర్పించాల్సిన విషయాలు

  1. ఎవరైనా తెలియని వ్యక్తులు (అపరిచితులు) పిలిస్తే వెళ్లకూడదు, వారితో మాట్లాడకూడదు.
  2. అపరిచితులు ఇచ్చే చాక్లెట్లు, గిఫ్ట్‌లు, బొమ్మలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
  3. ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే గట్టిగా అరవమని చెప్పాలి. ప్రజలు కూడా తమ చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

?ref_src=twsrc%5Etfw">November 21, 2025

Tags

#Mathura Kidnap Attempt#Viral Video#Child Safety Tips#Parenting Advice#Stranger Danger#మథుర#కిడ్నాప్ యత్నం