HomeArticlesబరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!

బరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!

బరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!

మన దేశంలో చాలా మందిని గమనిస్తే.. కాళ్లు, చేతులు సన్నగా ఉంటాయి, కానీ పొట్ట మాత్రం కుండలా (Pot Belly) ముందుకు వచ్చి ఉంటుంది. ఇది కేవలం వయసు పెరగడం వల్లో, వ్యాయామం లేకపోవడం వల్లో వస్తుందని అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఉన్న అసలు కారణాలను ప్రముఖ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఎరిక్ బెర్గ్ సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే..


అసలు సమస్య కొవ్వు కాదు:

ఆ పొట్ట వెనుక కేవలం కొవ్వు మాత్రమే లేదు. ఫ్యాటీ లివర్ (Fatty Liver), దీర్ఘకాలిక కడుపు ఉబ్బరం, అజీర్ణం మరియు 'సిబో' (SIBO - చిన్న పేగులో బ్యాక్టీరియా పెరిగిపోవడం) వంటి సమస్యల సమ్మేళనమే ఆ పొట్ట.


భారతీయుల ఆహారమే కారణమా?:

ప్రపంచంలో మాంసాహారం (Meat) తక్కువగా తీసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడ ఎక్కువగా ఫైబర్, ధాన్యాలు (Grains) తీసుకుంటారు. మేకలు, గొరిల్లాలు వంటి శాకాహార జంతువులకు ఫైబర్‌ను జీర్ణం చేసుకుని పోషకాలుగా మార్చుకునే శక్తి ఉంటుంది. అందుకే వాటి పొట్టలు పెద్దగా ఉన్నా పర్వాలేదు. కానీ మనుషులు అలా కాదు. మనం హెర్బివోర్స్ (Herbivores) కాదు. అధిక ఫైబర్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల పేగుల్లో అది పులిసిపోయి (Fermentation), గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తుంది.


మరి పరిష్కారం ఏంటి?

డాక్టర్ బెర్గ్ సూచనల ప్రకారం ఈ సమస్య తగ్గాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి: చిరుతిళ్లు ఆపేయాలి: రోజంతా ఏదో ఒకటి తినడం (Snacking) వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. దానికి విశ్రాంతి ఇవ్వడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) పాటించాలి.


ఆహారపు మార్పులు:

గ్యాస్ కలిగించే ఆహారాలు, మైదా, నూనెలో వేయించిన పదార్థాలను పూర్తిగా మానేయాలి. ధాన్యాలను తగ్గించాలి.

ప్రోటీన్ పెంచాలి: మీ ఆహారపు అలవాట్లను బట్టి గుడ్లు, చేపలు లేదా మాంసాహారాన్ని చేర్చుకోవాలి. మాంసంలో ఉండే 'గ్లూటమైన్' పేగులను బాగు చేయడానికి సహాయపడుతుంది.

స్టమక్ యాసిడ్: గ్యాస్ రాగానే యాంటాసిడ్స్ వేసుకోవడం ఆపేసి, జీర్ణశక్తిని పెంచే సహజ పద్ధతులను పాటించాలి (ఉదాహరణకు నిపుణుల సలహాతో బీటైన్ హైడ్రోక్లోరైడ్ వంటివి). కడుపు ఉబ్బరం అనేది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, మీ శరీరం ఒత్తిడిలో ఉందనడానికి సంకేతం అని గుర్తించండి.

Tags

#Dr Eric Berg#Pot Belly Causes#Indian Diet#SIBO#Bloating Solutions#Intermittent Fasting#Stomach Health#ఆరోగ్య చిట్కాలు#ఎరిక్ బెర్గ్