HomeArticlesRRB NTPC 2025: డిగ్రీ అర్హతతో రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా!

RRB NTPC 2025: డిగ్రీ అర్హతతో రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా!

RRB NTPC 2025: డిగ్రీ అర్హతతో రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా!

RRB NTPC 2025: భారతీయ రైల్వేలో స్థిరపడాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


దేశవ్యాప్తంగా మొత్తం 5,810 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ (3,416), స్టేషన్ మాస్టర్ (615), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ (921) పోస్టులు ఉన్నాయి.


అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి (01-01-2026 నాటికి). రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.


జీతం: ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ. 25,500 నుండి రూ. 35,400 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సులు అదనం.


ముఖ్య తేదీలు: ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 27, 2025 వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపుకు నవంబర్ 29 వరకు సమయం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో సీబీటీ-1, సీబీటీ-2 పరీక్షలు ఉంటాయి.

Tags

#RRB NTPC 2025#Railway Jobs#Station Master Recruitment#Govt Jobs for Graduates#RRB Notification#రైల్వే ఉద్యోగాలు#ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ

Related Articles