HomeArticlesఫేక్ అకౌంట్లకు 'ఎక్స్' చెక్.. ఇక ఆ వివరాలన్నీ బయటపడాల్సిందే!

ఫేక్ అకౌంట్లకు 'ఎక్స్' చెక్.. ఇక ఆ వివరాలన్నీ బయటపడాల్సిందే!

ఫేక్ అకౌంట్లకు 'ఎక్స్' చెక్.. ఇక ఆ వివరాలన్నీ బయటపడాల్సిందే!

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల (Fake Accounts) బెడద ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రచారాలు చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (X - ఒకప్పటి ట్విట్టర్) కీలక నిర్ణయం తీసుకుంది.


'అబౌట్ దిస్ అకౌంట్' (About This Account) పేరుతో ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఏదైనా అకౌంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సదరు అకౌంట్‌ను ఏ దేశం నుంచి నిర్వహిస్తున్నారు? ఆ ప్రొఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు 'యూజర్ నేమ్' (User Name) మార్చారు? చివరిసారిగా ఎప్పుడు మార్పులు చేశారు? అనే విషయాలు ఇకపై గోప్యంగా ఉండవు.


ఉదాహరణకు, భారతీయుడినని చెప్పుకుంటూ విదేశాల నుంచి దేశ వ్యతిరేక ప్రచారం చేసేవారి గుట్టు ఈ ఫీచర్ ద్వారా రట్టవుతుంది. అంతేకాకుండా, యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా లాగిన్ అయ్యారా లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా వచ్చారా అనే టెక్నికల్ వివరాలు కూడా తెలుస్తాయి. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎక్స్ కూడా దీనిని అమలు చేయడం ద్వారా ప్లాట్‌ఫామ్‌లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

Tags

#X New Feature#About This Account#Fake Accounts#Social Media Security#Tech News#ఎక్స్ ట్విట్టర్#ఫేక్ అకౌంట్లు